భారతదేశం, జూన్ 23 -- మీరు ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో కొత్త ఫోన్ తీసుకోవాలని ఆలోచిస్తుంటే మీ కోసం కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ల ధర 5 నుంచి 8 వేల రూపాయల మధ్య ఉంటుంది. ప్రత్యేకత ఏంటంటే లిస్టులో శాంసంగ్, మోటరోలా వంటి స్మార్ట్‌ఫోన్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్లు బెస్ట్ ఇన్‌ సెగ్మెంట్ డిస్‌ప్లేలు, కెమెరాలతో వస్తున్నాయి. మీరు ధరను బట్టి గొప్ప ప్రాసెసర్, బ్యాటరీని కూడా పొందుతారు.

4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ మోటరోలా జీ05 4జీ ధరను అమెజాన్‌లో రూ.7,109గా నిర్ణయించారు. ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఫోన్లో గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో కూడిన 6.67 అంగుళాల గొప్ప డిస్‌ప్లే లభిస్తుంది. ఈ డిస్ ప్లే బ్రైట్ నెస్ లెవల్ 1000 నిట్స్ వరకు ఉంటుంది. ప్రాసెసర్‌గా కంపెనీ హీలియో జీ81 ఎక్స్ ట్రీమ్‌ను ఈ ఫోన్‌లో అందిస్తోంది. ఫోన్ ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్. ఈ ...