భారతదేశం, జనవరి 28 -- సుహాస్ మరో కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో థియేటర్లకు రాబోతున్నాడు. అతను హీరోగా రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ 'హే భగవాన్'. ఈ సినిమా టీజర్ ను ఇవాళ (జనవరి 28) రిలీజ్ చేశారు. ఫన్నీ ఎలిమెంట్స్, డైలాగ్స్ తో టీజర్ కడుపుబ్బా నవ్వించేలా ఉంది. టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయనే కామెంట్లు వస్తున్నాయి.

సుహాస్, శివాని నాగారం జంటగా నటిస్తున్న మూవీ 'హే భగవాన్'. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను బుధవారం (జనవరి 28) రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్ వీకే, సుదర్శన్ తదితరులు కూడా నటిస్తున్నారు. టీజర్ కామెడీగా ఉంది. దీన్ని బట్టి చూస్తే సినిమా కడుపుబ్బా నవ్వించేలా ఉండబోతుందని స్పష్టమవుతోంది.

చిన్నప్పటి నుంచి బిజినెస్ చేయాలనే కోరికతో ఉన్న యువకుడి కథే హే భగవాన్. నాకు ఎలాగో మా ఫాదర్ బిజినెస్ ఉంద...