భారతదేశం, జూన్ 24 -- మలయాళ సినిమాలంటేనే డిఫరెంట్ స్టోరీ లైన్ తో వస్తాయనే పేరుంది. థ్రిల్లర్లతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ను బలంగా చాటుతాయి. అలాగే కడుపుబ్బా నవ్విస్తాయి కూడా. ఇప్పుడు అలాగే నవ్విస్తూనే కన్నీళ్లు తెప్పించే మలయాళ సినిమా 'పరివార్' ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు (జూన్ 24) నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. తండ్రి వజ్రపు ఉంగరం గురించి ఆశ పడే నలుగురు కొడుకుల కథతో ఈ సినిమా వచ్చింది.

మలయాళ కామెడీ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా 'పరివార్' మంగళవారం (జూన్ 24) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ మలయాళం భాషలో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అడుగుపెట్టింది. థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. మార్చి 7న పరివార్ మూవీ థియేటర్లలో రిలీజైంది.

పరివార్ మూవీ థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. మానవ సంబంధాలు, కుటు...