Hyderabad, ఆగస్టు 25 -- సయ్యారా మూవీ ఈ ఏడాది ఎంతటి సంచలనం సృష్టించిందో మనకు తెలుసు. ఓ చిన్న సినిమాగా రిలీజై బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఇందులోని సయ్యారా టైటిల్ సాంగ్ అయితే కొన్ని నెలలుగా టాప్ ట్రెండింగ్ సాంగ్స్ లో కొనసాగుతోంది. ఇప్పుడా పాటను ఈ మూవీ హీరోయిన్ అనీత్ పడ్డా తన తండ్రితో కలిసి పాడింది. గిటార్ వాయించుకుంటూ ఆమె పాడిన ఈ పాట వైరల్ అవుతోంది.

అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా నటించిన సయ్యారా సినిమాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇద్దరూ ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారు. వీరిద్దరి అద్భుత నటన ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. కొన్ని వారాల పాటు బాక్సాఫీస్ వద్ద కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా వసూళ్లు మందగించి ఉండొచ్చు కానీ నటీనటులకు ఫ్యాన్ క్రేజ్ మాత్రం పెరుగుతోంది.

తాజాగా తన అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తూ అనీత్ పడ్డా తన సింగ...