భారతదేశం, నవంబర్ 25 -- సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ తో జరగాల్సిన తన వివాహం నిరవధికంగా వాయిదా పడిన ఒక రోజు తర్వాత భారత క్రికెట్ స్టార్ స్మృతి మంధాన సంచలన నిర్ణయం తీసుకుంది. తన సోషల్ మీడియా ఖాతాల నుండి వివాహానికి సంబంధించిన ప్రతి పోస్టును డిలీట్ చేసింది.

తన ప్రియుడు, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ తో స్మృతి మంధాన పెళ్లి గ్రాండ్ గా జరగాల్సింది. వెడ్డింగ్ కు ముందు అన్ని వేడుకలను ఈ జోడీ అంగరంగ వైభవంగా చేసుకుంది. కానీ నవంబర్ 23న జరగాల్సిన పెళ్లి స్మృతి మంధాన తండ్రి అనారోగ్యం కారణంగా వాయిదా పడింది. స్మృతి తండ్రికి హార్ట్ ఎటాక్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పెళ్లి నిరవధికంగా వాయిదా పడింది.

ఆదివారం స్మృతి మంధాన సొంత ఊరు సాంగ్లీలో జరగాల్సి ఉన్న వివాహం, ఆమె తండ్రి శ్రీనివాస్ మంధాన ఆకస్మికంగా అనారోగ్యానికి గురికావడంతో నిలిచిపోయింది. ఆమె మేనేజర్ త...