భారతదేశం, డిసెంబర్ 9 -- టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్ గా మారింది. వివిధ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో తన గుర్తింపు దుర్వినియోగం అవుతోందని ఆయన ఆరోపించారు. తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోరారు. ఈ మేరకు ఈ-కామర్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు మూడు రోజుల్లోగా జూనియర్ ఎన్టీఆర్ దాఖలు చేసిన ఫిర్యాదుపై స్పందించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.

జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పేరు, చిత్రం, సారూప్యత, తన గుర్తింపు ఇతర లక్షణాలను అనధికారికంగా ఉపయోగించకుండా తన వ్యక్తిత్వ హక్కులను పరిరక్షించాలని కోరుతూ జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ప్రకారం న్యాయమూర్తి జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ ఈ కేసును విచారించారు. సీనియర్ న్యాయవాది జె సాయి దీప...