Telangana,delhi, జూలై 24 -- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీతో సమావేశమైంది. రాష్ట్రంలో చేపట్టిన కుల గణనతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశంపై లోతుగా చర్చించారు. కుల గణన సర్వే తీరును, రాష్ట్ర శాసన సభ ఆమోదించిన బిల్లులపై వివరాలను పేర్కొన్నారు.

ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్, పొన్నం, కొండు సురేఖ, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల సర్వే తీరుపై లోతుగా చర్చించారు. రాష్ట్రంలోని పరిస్థితులను ఖర్గే, రాహుల్ కు వివరించారు.

ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన ఈ భేటీ సుమారు 2 గంటల పాటు సాగింది. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించిన బీసీ బిల్లున...