భారతదేశం, జూలై 10 -- హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో భూకంపం సంభవించడంతో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్‌)లోని ఇతర ప్రాంతాలలో బలమైన ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4గా అంచనా వేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సీస్మోలజీ ప్రకారం, భూకంపం లోతు 10 కి.మీ.

భూకంప కేంద్రం పశ్చిమ ఢిల్లీకి కేవలం 51 కిలో మీటర్ల దూరంలో ఉన్నది. అంతేకాదు రాజస్థాన్, యూపీలోని పలు ప్రదేశాల్లోనూ భూమి కంపించింది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఓ వైపు వర్షాలు కురుస్తున్న సమయంలో భూకంపం సంభవించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో ఉదయం 9.04 గంటలకు భూకంపం సంభవించిన తర్వాత ఫ్యాన్లు, ఇతర గృహోపకరణాలు ఊగిపోయాయి. దీంతో నివాసితులు ఇళ్లను వదిలి బయటకు పరుగులు తీశారు. నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్‌లలో కూ...