భారతదేశం, ఏప్రిల్ 30 -- సుదీర్ఘ కాలం తర్వాత ఏపీ డీజీపీ ఎంపికపై ప్యానల్ మీటింగ్‌ జరుగుతోంది. యూపీఎస్సీ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన జాబితా నుంచి ముగ్గురి పేర్లను ప్యానల్ ఎంపిక చేస్తుంది. కేంద్రం సిఫార్సు చేసిన వారిలో ఒకరికి డీజీపీ అవకాశం లభిస్తుంది.

ఏపీలో కొన్నేళ్లుగా పూర్తి స్థాయి డీజీపీల నియామకం చేయడం లేదు. రాజకీయ కారణాలతో కావాల్సిన వారిని డీజీలుగా నియమించే ఆనవాయితీ వైసీపీ హయంలో మొదలైంది. గౌతమ్‌ సవాంగ్‌ను తప్పించి కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డికి బాధ్యతలు అప్పగించే సమయంలో పూర్తి అదనపు హోదాలో నియమించారు.

వైసీపీ హ‍యంలో డీజీపీ రేసులో సీనియర్లు ఉన్నా రాజకీయ కారణాలతో రాజేంద్రనాథ్‌ రెడ్డికి అవకాశం దక్కింది. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈసీ ఆదేశాలతో హరీష్‌ కుమార్‌ గుప్తాను ఈసీ డీజీపీగా నియమించింది. చంద్రబాబు ప్రమాణ స్వీక...