భారతదేశం, మే 26 -- తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీలో మకాం వేశారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌ తిరిగి రావాల్సి ఉన్నా చివరి నిమిషంలో ఆయన పర్యటన వాయిదా పడింది. పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జితో భేటీ తర్వాత హైదరాబాద్‌ వెళ్తారని చెప్పినా ఆఖరి నిమిషంలో ఆయన పర్యటన వాయిదా పడింది. సోమవారం తెలంగాణ రాజకీయ వ్యవహారాలపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ మళ్లీ తెరపైకి వచ్చింది. ముఖ‌్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఢిల్లీలోనే బస చేయడంతో మంత్రి వర్గ విస్తరణ కోసమేనని జోరుగా ప్రచారం జరుగుతోంది. నీతి ఆయోగ్ భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌ రెడ్డి ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ పెద్దలతో భేటీ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌తో కలిసి పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జితో చర్చించారు. ఆదివారం రాత్రి సమావేశంలో ఓ నిర...