భారతదేశం, ఏప్రిల్ 23 -- టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద స్ట్రెయిట్ సినిమాల‌కు ధీటుగా మ‌ల‌యాళం, త‌మిళంతో పాటు ఇత‌ర భాష‌ల‌కు చెందిన డ‌బ్బింగ్ సినిమాలు భారీగా వ‌సూళ్ల‌ను రాబ‌డుతోన్నాయి.ఈ డ‌బ్బింగ్ మూవీస్ ప్ర‌మోష‌న్స్ కోసం పెద్ద ఎత్తున ఖ‌ర్చు పెడుతూ ఆయా సినిమాల ప‌ట్ల తెలుగు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోన్నారు మేక‌ర్స్‌.

గ‌త కొన్నేళ్లుగా వారానికి నాలుగైదు డ‌బ్బింగ్ సినిమాలు థియేట‌ర్ల‌లోకి రావ‌డం ప‌రిపాటిగా క‌నిపిస్తోంది. ఈ డ‌బ్బింగ్ సినిమాల కార‌ణంగా కొన్నిసార్లు తెలుగు స్ట్రెయిట్ సినిమాల‌కు థియేట‌ర్లు దొర‌క‌ని ప‌రిస్థితి త‌లెత్తుతోంది. ముఖ్యంగా చిన్న సినిమాల‌పై ఈ డ‌బ్బింగ్ మూవీస్ ఎఫెక్ట్ భారీగా ప‌డుతోంద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు ఆవేద‌న వ్య‌క్తం చేస్తోన్నాయి.

మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన అల‌ప్పుజ జింఖానా ఈ శుక్ర‌వారం (ఏప్రిల్ 25న‌) ప్రేక్ష‌క‌లు ముంద...