భారతదేశం, మే 3 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతికతకు పెద్దపీట వేస్తుంది. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి తీసుకొచ్చి వందల సర్వీసులను ప్రజల ఇంటికే చేర్చింది. ప్రజలు ఇంట్లో నుంచే ప్రభుత్వ సర్వీసులు సులభవంగా పొందవచ్చు. తాజాగా డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డ్వాక్రా రుణాలు, పొదుపు చెల్లింపునకు ఓ యాప్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

డ్వాక్రా రుణ వాయిదాల చెల్లింపునకు ప్రతీ నెల మహిళలు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు, స్వయం సహాయక సంఘాల రుణ చెల్లింపునకు ఓ యాప్ తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం. కొత్త మొబైల్ యాప్ స్వయం సహాయక సంఘాల సభ్యులకు చాలా సులభంగా, పారదర్శకతతో రుణాల చెల్లింపులను సులభతరం చేయనుంది.

ఏపీ ప్రభుత్వం మహిళల సాధికారితను, స్వయం ఉపాధిని ప్రోత్సహించ...