భారతదేశం, జనవరి 23 -- రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రైవేట్ వ్యక్తుల వద్ద రుణాలు తీసుకునే పరిస్థితి ఉండకూడదని సీఎం చంద్రబాబు అన్నారు. వ్యవసాయం సహా ఏ అవసరం వచ్చినా బ్యాంకుల వద్దకు వెళ్లి రుణాలు తీసుకునే పరిస్థితి రావాలని అభిప్రాయపడ్డారు. బ్యాంకర్లు ఆ దిశగా పని చేయాలని సూచించారు. సచివాలయంలో 233, 234వ ఎస్ఎల్బీసీ సమావేశంలో వివిధ రంగాలకు ఇచ్చే రుణాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి బ్యాంకర్లు విరివిగా రుణాలు ఇవ్వాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెన్యూవబుల్ ఎనర్జీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాయని వివరించారు. "డిస్కంలు కూడా కౌంటర్ గ్యారెంటీ ఇస్తున్నాయి. రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి బ్యాంకర్లు ఇచ్చే రుణాలపై మరింత చొరవ చూపాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రుణాలు పెద్ద ఎత్తున ఇవ్వాలి... అప్పుడే అన్ని రంగ...