భారతదేశం, సెప్టెంబర్ 1 -- ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో యాక్షన్ థ్రిల్లర్ డ్రాగన్ తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్ట్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటి. ఈ సినిమా కోసం పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో తారక్ తో రొమాన్స్ చేసే హీరోయిన్ ఎవరనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గానే ఉండేది. ఇప్పుడు దీనిపై ఓ క్లారిటీ వచ్చింది.

జూనియర్ ఎన్టీఆర్ సరసన డ్రాగన్ సినిమాలో కన్నడ బ్యూటీ రొమాన్స్ చేయనుంది. తారక్ సరసన రుక్మిణి వసంత్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యూటీ ఇప్పుడు తమిళంలో మదరాసి సినిమా చేసింది. ఈ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. రీసెంట్ గా ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ జరిగింది.

మదరాసి ప్రి రిలీజ్ ఈవెంట్లో ప్రొడ్యూసర్ ఎన్వీ ప్రసాద్ బిగ్ న్యూస్ చెప్పారు. డ్రాగన్ సినిమాలో రుక్మిణి నటిస్తుందని వెల్లడించారు. మదరాసి...