Hyderabad, జూన్ 23 -- తమిళ, తెలుగు నటుడు శ్రీకాంత్ తెలుసు కదా. తెలుగులో శ్రీరామ్ గా సుపరిచితుడు. అతడు డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాడు. పోలీసులు విచారణ కోసం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఏషియానెట్ న్యూస్ రిపోర్ట్ ప్రకారం, బార్‌లో గొడవ, డ్రగ్స్ కేసులో అరెస్టయిన మాజీ ఏఐఏడీఎంకే సభ్యుడు ఒకరు శ్రీకాంత్ పేరు చెప్పినట్లు తెలుస్తోంది.

నుంగంబాక్కంలోని ఒక బార్‌లో జరిగిన గొడవ అనంతరం, మాజీ ఏఐఏడీఎంకే సభ్యుడు ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతను డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను నటుడు శ్రీకాంత్‌కు డ్రగ్స్ ఇచ్చినట్లు ఒప్పుకున్నాడని సమాచారం.

కోకైన్‌తో పాటు ఇతర డ్రగ్స్‌ను కూడా శ్రీకాంత్‌కు సరఫరా చేసినట్లు ప్రసాద్ చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. న్యూస్18 తమిళం రిపోర్ట్ ప్రకారం, శ్రీకాంత్ రూ. 12,000కు ఒ...