భారతదేశం, జూన్ 24 -- టాలీవుడ్ లో హీరో, సైడ్ క్యారెక్టర్, విలన్ తరహా వేషాలతో పాపురల్ అయ్యాడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్. మన ఏపీకి చెందిన అతను తమిళనాడులో డ్రగ్ కేసులో అరెస్టు కావడం కలకలం రేపుతోంది. మెడికల్ టెస్టుల్లో శ్రీరామ్ డ్రగ్స్ వాడినట్లు తేలిందని పోలీసులు చెప్తున్నారు. 40 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో శ్రీరామ్ తెలుగులో చేసిన సినిమాలు ఏవి? అనే చర్చ జోరందుకుంది. మీరూ ఓ సారి చూసేయండి.

2002లో వచ్చిన తమిళ సినిమా రోజా కూటమ్ తో తెరంగేట్రం చేశాడు శ్రీకాంత్. ఆ సినిమాకు ఐటీఎఫ్ఏ ఉత్తమ నూతన నటుడి అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాతి ఏడాది ఒకరికి ఒకరు సినిమాతో తెలుగులో అడుగుపెట్టాడు శ్రీకాంత్. ఇందులో డ్యుయల్ రోల్ పోషించాడు. ఆ తర్వాత నాలుగేళ్ల పాటు మళ్లీ తెలుగులో కనిపించలేదు. తమిళ్ సినిమాలతో బిజీ అయిపోయాడు.

శ్ర...