భారతదేశం, మే 29 -- సొగసైన డిజైన్, మిడ్-రేంజ్ పనితీరును మేళవించిన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ మోటరోలా రేజర్ 60 ని భారత్ లో లాంచ్ చేసింది. తన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లైనప్ ను విస్తరించే లక్ష్యంతో మోటరోలా వివిధ సెగ్మెంట్లలో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ ను విడుదల చేస్తోంది.

మోటరోలా రేజర్ 60 ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ధర రూ .49,999గా నిర్ణయించారు. ఇది ధరలో తమ ఫ్లాగ్ షిప్ రేజర్ 60 అల్ట్రా కంటే దిగువన ఉంటుంది. రేజర్ 50 కి ఎగువన ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను జూన్ 4 నుండి ఫ్లిప్ కార్ట్, రిలయన్స్ డిజిటల్, మోటరోలా ఇండియా వెబ్సైట్, ఇతర ప్రధాన ఆఫ్ లైన్ రిటైలర్ల వద్ద కొనుగోలు చేయవచ్చు. మోటరోలా రేజర్ 60 ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. వినియోగదారులు మూడు పాంటోన్-సర్టిఫైడ్ కలర్ వేరియంట్ల నుండి ఎంచుకోవచ్చు. అవి పెరల్ మార్బుల్ ఫి...