భారతదేశం, మే 20 -- యాక్టింగ్ విషయానికి వస్తే నవరసాలను అలవోకగా పలికించడం.. ఒక్క టేక్ లోనే పెద్ద పెద్ద డైలాగ్ లు చెప్పడం జూనియర్ ఎన్టీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. ఇక డ్యాన్స్ సంగతి అంటారా? ఎలాంటి కష్టమైన స్టెప్స్ అయినా.. ఎలాంటి గ్రేస్ మూమెంట్స్ అయినా తారక్ ఈజీగా చేసేస్తారు. యాక్టింగ్, డ్యాన్సింగ్ మాత్రమే కాదు తారక్ లో మరో స్పెషల్ టాలెంట్ కూడా ఉంది. అదే సింగింగ్. ఈ రోజు (మే 20) ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆ సాంగ్స్ పై ఓ లుక్కేయండి.

జూనియర్ నందమూరి తారక రామారావు సింగింగ్ లోనూ సూపర్ అనిపించుకుంటున్నారు. గొంత సవరించుకుని ఆయన పాట పాడితే అది సెన్సేషన్ గా మారుతోంది. హీరోలు పాటలు పాడటం కామనే. కానీ ఎన్టీఆర్ వాయిస్ మాత్రం భిన్నంగా ఉంటుంది. ఆయన పాడిన పాటలు సూపర్ హిట్లుగా నిలవడమే అందుకు నిదర్శనం.

ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తారక్ హీరోగా వచ్చిన 'యమదొం...