భారతదేశం, జనవరి 11 -- సంక్రాంతి పండగకు తెలుగు బాక్సాఫీస్ దగ్గర సందడి కొనసాగుతోంది. ఇప్పటికే ది రాజా సాబ్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు ప్రభాస్. ఇక మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞ‌ప్తి, నారీ నారీ నడుమ మురారీ, అనగనగా ఒక రాజు సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ముఖ్యంగా రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞ‌ప్తిపై మంచి బజ్ నెలకొంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ కిశోర్ తిరుమల డ్యాన్స్ వైరల్ గా మారింది.

సాధారణంగా డైరెక్టర్లు తెరవెనకాలే కష్టపడుతుంటారు. తమ కలల సినిమాను రెడీ చేస్తారు. బయట ఎక్కువగా కనిపించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ప్రమోషన్లలోనూ డైరెక్టర్లు డిఫరెంట్ దారిలో వెళ్తున్నారు. ముఖ్యంగా అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్లు ప్రమోషన్లను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే భర్త మహాశయులకు వి...