భారతదేశం, డిసెంబర్ 18 -- తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) ప్రెసిడెంట్‌గా పాపులర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ శ్రీమతి, వీవీ సుమలత దేవి ఎన్నికయ్యారు. ఈ క్రమంలో సుమలత దేవి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఇవాళ (డిసెంబర్ 18) హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి శ్రీశైలం యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథులు గా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్, వీవీ సుమలత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ .. "ఈ యూనియన్‌కు మొట్ట మొదటిసారిగా మహిళ అధ్యక్షురాలు ఎన్నికవ్వడం ఆనందంగా ఉంది. సుమలత గారి విజయం యూనియన్‌కు కొత్త రూపుని తీసుకు వస్తుందని నమ్ముతున్నాను" అని అన్నారు.

"జానీ మాస్టర్ గారు దేశ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుక...