భారతదేశం, నవంబర్ 5 -- కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు మహాక్షేత్రంలో శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోటి వత్తికా దీపోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు పీవీ కృష్ణారెడ్డి, సుధ దంపతుల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కొమ్మారెడ్డి బాపిరెడ్డి, విజయ భాస్కరమ్మ. పీ నాగిరెడ్డి, ప్రసన్న, నాగేశ్వర రెడ్డి, వెంకటలక్ష్మి దంపతులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కోటి వత్తికా దీపోత్సవంలో పాల్గొన్న వారికి అవసరమైన పూజా సామాగ్రిని ఆలయ ధర్మకర్తలు కృష్ణారెడ్డి, సుధ దంపతులు ఉచితంగా అందచేశారు. కార్తీక దీపోత్సవాన్ని పురస్కరించుకుని మహాక్షేత్రంలో బుధవారం ఉదయం అభిషేకం, అర్చన కైంకర్యాలు, ప్రత్యేకంగా పూజలు చేశారు. శాస్త్రానుసారంగా కార్తీక మాసం కార్తీక...