భారతదేశం, డిసెంబర్ 5 -- డోకిపర్రు, (గుడ్లవల్లేరు, కృష్ణా జిల్లా ), డిసెంబర్ 5: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు మహాక్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విశేష కళ్యాణం శుక్రవారం కన్నుల పండువగా జరిగింది. మహాక్షేత్రం దశమ వార్షికోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా ప్రతి ఏడాది మాదిరిగానే దేవదేవుని విశేష కల్యాణాన్ని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు పీ వీ కృష్ణారెడ్డి, సుధా రెడ్డి దంపతుల పర్యవేక్షణలో నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త సుధారెడ్డితో పాటు కొమ్మారెడ్డి బాపురెడ్డి, విజయభాస్కరమ్మ, పీ నాగిరెడ్డి, ప్రసన్న దంపతులు పీటల మీద కూర్చొని శ్రీనివాసుని కల్యాణాన్ని జరిపించారు.

కన్నుల పండువగా జరిగిన ఈ కళ్యాణానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై తిలకించి తీర్ధ ప్రసాదాలు స్వీకరిం...