భారతదేశం, జూలై 18 -- డొనాల్డ్ ట్రంప్ కాలి మడమల్లో వాపు, కుడి చేతికి స్వల్పంగా గాయాలు కావడం వంటి చిత్రాలు వైరల్ గా మారాయి. దాంతో, వైట్ హౌస్ ట్రంప్ ఆరోగ్యానికి సంబంధించి వివరణ ఇచ్చింది.

అధ్యక్షుడిని వైద్యులు పరీక్షించారని, ఆయనకు దీర్ఘకాలిక సిరల సమస్య ఉందని తేలిందని, అందువల్లనే కాలి చీలమండ వద్వ స్వల్పంగా వాపు ఏర్పడిందని వైట్ హౌస్ గురువారం తెలిపింది. అయితే, ఇది "నిరపాయమైన పరిస్థితి" అని స్పష్టం చేసింది. ట్రంప్ హెల్త్ చెకప్ ఫలితాలు సాధారణ పరిమితుల్లోనే వచ్చాయని, ఆయన గుండె నిర్మాణం, పనితీరు కూడా నార్మల్ గానే ఉన్నాయని డాక్టర్ లేఖలో పేర్కొన్నారు. ట్రంప్ చేతిపై గాయాలు "తరచుగా షేక్ హ్యాండ్ ఇవ్వడం, తరచుగా చేతులు కడుక్కోవడం మరియు ప్రామాణిక హృదయనాళ నివారణ నియమావళిలో భాగంగా వినియోగించే ఆస్పిరిన్ వాడకం వల్ల చేతులపై మృదు కణజాల స్వల్పంగా దెబ్బతిన్నది అని...