భారతదేశం, ఏప్రిల్ 21 -- బాబిల్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించిన లాగ్ఔట్ సినిమా ముందు నుంచి ఆసక్తిని పెంచింది. ట్రైలర్ తర్వాత బజ్ బాగానే వచ్చింది. దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ కుమారుడే బాబిల్. సోషల్ మీడియాకు బానిసలైతే ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయనే అంశంతో ఈ మూవీ తెరకెక్కింది. ఈ సైబర్ థ్రిల్లర్ చిత్రానికి అమిత్ గోలానీ దర్శకత్వం వహించారు. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు వచ్చిన లాగ్ఔట్ మూవీకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది.

లాగ్ఔట్ సినిమా ఏప్రిల్ 18వ తేదీన జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍‌కు అడుగుపెట్టింది. హిందీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. స్ట్రీమింగ్ తర్వాత ఈ చిత్రానికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీని జీ5లో చూసిన కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. చాలా మంది ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేశారు.

సోషల్ మీడియాకు చాలా మంది బ...