భారతదేశం, జూన్ 17 -- ఓటీటీల్లో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ అనే భాషాభేధాలు ఉండవు. ఇప్పుడు ఏ లాంగ్వేజ్ మూవీ అయినా ఓటీటీలో మిగతా భాషల్లోనూ స్ట్రీమ్ అవుతోంది. ఓటీటీ కారణంగా ఇతర భాషల సినిమాలనూ తెలుగులో మన ఆడియన్స్ చూసేస్తున్నారు. ఇప్పుడు ఓ హిందీ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ వస్తున్న ఆ మూవీ పేరు 'ఆప్ జైసా కోయి'. రొమాంటిక్ కామెడీ డ్రామాతో తెరకెక్కిన ఈ ఫిల్మ్ ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు రాబోతోంది.

బాలీవుడ్ మూవీ 'ఆప్ జైసా కోయి' నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కాబోతోంది. నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ అవనుంది. నెట్‌ఫ్లిక్స్‌ ఒరిజినల్ ఫిల్మ్ గా ఇది డిజిటల్ బాట పడుతోంది. ఈ ఆప్ జైసా కోయి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను నెట్‌ఫ్లిక్స్‌ మంగళవారం (జూన్ 17) అనౌన్స్ చేసింది. జులై 11 నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందన...