భారతదేశం, అక్టోబర్ 31 -- డిఫరెంట్ జానర్ సినిమాలతో డిజిటల్ ఆడియన్స్ ను ఎప్పటికప్పుడూ ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది ఈటీవీ విన్. ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో మరో మూవీ డైరెక్ట్ గా స్ట్రీమింగ్ కు రానుంది. మ్యూజిక్ ప్లస్ ఎమోషన్ తో తీర్చిదిద్దిన చిన్న సినిమా 'సింధు భైరవి' డిజిటల్ స్ట్రీమింగ్ కు టైమ్ దగ్గరపడింది. ఈ మూవీకి దిగ్గజ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేయడం విశేషం.

మ్యూజికల్ ఎమోషనల్ మెలోడీగా తెరకెక్కించిన సింధు భైరవి సినిమా ఓటీటీలో అడుగుపెట్టనుంది. డైరెక్ట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ నవంబర్ 2 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో అందుబాటులో ఉంటుంది. ఈటీవీ విన్ ఓటీటీ కథా సుధలో భాగంగా ప్రతి ఆదివారం కొత్త షార్ట్ ఫిల్మ్ ను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆదివారం సింధు భైరవి స్ట్రీమింగ్ కానుంది.

సింగ‌ర్ కృష్ణ చైత‌న్య‌, అయ్యంగార్ మృదుల...