భారతదేశం, సెప్టెంబర్ 9 -- బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన కన్నడ హారర్-కామెడీ థ్రిల్లర్ 'సు ఫ్రమ్ సో' (Su From So) ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఇవాళ (సెప్టెంబర్ 9) నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. డైరెక్టర్ సొంత ఊర్లో జరిగిన వాస్తవ సంఘటల నుంచి స్ఫూర్తి పొంది ఈ సినిమాను తెరకెక్కించారు.

సినీ లవర్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. కన్నడలో రిలీజై అదరగొట్టిన హారర్ కామెడీ థ్రిల్లర్ 'సు ఫ్రమ్ సో' ఓటీటీలోకి వచ్చేసింది. మంగళవారం జియోహాట్‌స్టార్ లో ఇది అడుగుపెట్టింది. కన్నడతో పాటు తెలుగు, మలయాళంలో ఈ మూవీ చూసేందుకు అందుబాటులో ఉంది. కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీని మలయాళం, తెలుగులో డబ్ చేసి థియేటర్లలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన సు ఫ్రమ్ సో థియేటర్లలో మొదటి రోజు రూ...