భారతదేశం, డిసెంబర్ 1 -- హాలీవుడ్ సినిమాలను తెలుగు ఆడియన్స్ కూడా ఆదరిస్తారు. ఓటీటీల్లో ఈ మూవీస్ కు ఫాలోయింగ్ ఎక్కువే. ముఖ్యంగా బ్రాడ్ పిట్ లాంటి స్టార్లు నటించిన సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు బ్రాడ్ పిట్ హీరోగా నటించిన ఓ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. థియేటర్లో రిలీజైన మూడేళ్లకు ఓటీటీ ఆడియన్స్ కు అందుబాటులోకి రాబోతున్న మూవీ 'బేబిలాన్'.

హాలీవుడ్ రొమాంటిక్ కామెడీ మూవీ బేబిలాన్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. బ్రాడ్ పిట్ హీరోగా నటించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోకి అడుగుపెట్టనుంది. డిసెంబర్ 7 నుంచి బేబిలాన్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్నప్పటికీ అది రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది.

దర్శకుడు డెమియన్ చాజెల్ 'బేబిలాన్' రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కించారు. ఇది హాలీవ...