భారతదేశం, డిసెంబర్ 3 -- స్మాల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్ కు వెళ్లిన నటుడు సుడిగాలి సుధీర్. బజర్దస్త్ తో మంచి పేరు తెచ్చుకుని, సినిమాల్లో చిన్న క్యారెక్టర్లతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. మూవీ రిజల్ట్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ చిత్రాల్లో యాక్ట్ చేస్తున్నాడు. అయితే అతని అప్ కమింగ్ మూవీ గోట్ (G.O.A.T) మూవీ వివాదంలో చిక్కుకున్నట్లు కనిపిస్తున్నాడు సుధీర్.

సుధీర్, దివ్య భారతి జంటగా తెరకెక్కుతున్న సినిమా గోట్. పాగల్ సినిమా ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ రెండున్నరేళ్ల కిందటే స్టార్ట్ అయింది. కానీ డైరెక్టర్, నిర్మాత, హీరో మధ్య విభేధాలు ఈ మూవీకి అడ్డంకిగా మారాయి. ఈ సినిమా నుంచి రీసెంట్ గా 'ఓడియమ్మా' సాంగ్, టీజర్ లాంఛ్ చేశారు. కానీ ఈ ఈవెంట్లకు సుధీర్ దూరంగా ఉన్నాడు. ప్రమోషన్లకు రావడం లేదు...