భారతదేశం, డిసెంబర్ 18 -- జేమ్స్ కామెరాన్ అద్భుత సృష్టి 'అవతార్: ఫైర్ అండ్ యాష్' (Avatar: Fire and Ash) శుక్రవారం (డిసెంబర్ 19) విడుదల కానుంది. ఈ సందర్భంగా స్పెషల్ ప్రీమియర్ చూసిన స్టార్ డైరెక్టర్ సుకుమార్.. సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సినిమా చూస్తున్నంతసేపు తెలుగు సినిమాల్లో ఉండే బలమైన ఎమోషన్స్ కనిపించాయని, కొన్ని సీన్లు చూసి తన కళ్లలో నీళ్లు తిరిగాయని సుకుమార్ రివ్యూ ఇవ్వడం విశేషం.

ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న విజువల్ వండర్ 'అవతార్ 3' విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే రాజమౌళి ఈ సినిమాను చూసి మెచ్చుకోగా.. తాజాగా 'పుష్ప' డైరెక్టర్ సుకుమార్ కూడా తన రివ్యూను పంచుకున్నాడు. జేమ్స్ కామెరాన్ పనితనాన్ని చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పాడు.

కామెరాన్ గురించి సుకుమార్ మాట్లాడుతూ.. "జేమ్స్ కామెరాన్.. ఆయన ఈ లోకంలో మనిషి కాదు.. పండోరా (Pandora) ...