భారతదేశం, డిసెంబర్ 9 -- పెళ్లికి ముందు తన డేటింగ్ రోజుల గురించి నటి శ్రియా శరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. ఫిల్మ్ మేకర్-కంటెంట్ క్రియేటర్ ఫరా ఖాన్ ఇటీవల నటి శ్రియా శరణ్ వీడియో కోసం ముంబై నివాసానికి వెళ్లారు. అక్కడ వీరిద్దరి మధ్య సరదా సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా శ్రియా తన వ్యక్తిగత జీవితం గురించి, ముఖ్యంగా తన భర్త ఆండ్రీ కోషీవ్ తో ప్రేమలో ఉన్నప్పటి తొలి జ్ఞాపకాల గురించి అభిమానులకు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.

భర్త ఆండ్రీతో డేటింగ్ గురించి శ్రియా శరణ్ మనసువిప్పి చెప్పింది. ఫరా లేటెస్ట్ కుకింగ్ వ్లాగ్ లో తన భర్త ఆండ్రీ డేటింగ్ రోజుల్లో తన కోసం ప్రతి ఉదయం టిఫిన్ రెడీ చేసే పెట్టేవాడని శ్రియా తెలిపింది.

"మేము డేటింగ్ లో ఉన్నప్పుడు, అతను ఉదయాన్నే లేచి నాకు అల్పాహారం చేసేవాడు" అని శ్రియా చెప్పింది. ఫరా వెంటనే ఆటపట్టిస్తూ.. "డేటింగ్...