Hyderabad, మార్చి 14 -- వేసవిలో చల్ల చల్లని కొండ ప్రదేశాలకు వెళ్లాలని ఎంతోమంది ప్లాన్ చేస్తారు. ఇప్పుడు అందరూ వెళ్లే ప్రాంతాలకే కాదు కొన్నిసార్లు కొత్త హిల్ స్టేషన్లకు కూడా వెళ్లి రావాలి. ఉత్తర భారత దేశంలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అవి అలాంటి ప్రసిద్ధ గమ్యస్థానాలలో డెహ్రాడూన్ ఒకటి. ఎంతో మంది డెహ్రాడూన్ వెళ్లి వస్తూ ఉంటారు. డెహ్రాడూన్ లోనే ఒక హిల్ స్టేషన్ ఉంది. చాలా తక్కువ మందికి మాత్రమే ఇది తెలుసు. దాని పేరు కనాటల్ హిల్ స్టేషన్. పచ్చని లోయల మధ్య ఉండే ఈ కనాటల్ హిల్ స్టేషన్‌కు వెళితే తిరిగి రావాలన్నా కోరిక రాదు. అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అంత అందంగా ఉంటుంది ఈ హిల్ స్టేషన్.

ఈమధ్య కనాతల్ హిల్ స్టేషన్‌కు పర్యాటకుల తాకిడి పెరిగిపోతోంది. కానీ ఇతర పర్యాటక ప్రదేశాలతో పోలిస్తే ఇక్కడ రద్దీ తక్కువనే చెప్పుకోవాలి. ఎందుకంటే దీని గురించి తక్కు...