భారతదేశం, జూలై 3 -- మహారాష్ట్రలోని పుణెలో కొరియర్ డెలివరీ బాయ్ నని చెప్పి ఇంట్లోకి ప్రవేశించిన ఒక వ్యక్తి ఆ ఇంట్లో ఒంటరిగా ఉంటున్న యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత, అతడు ఆ యువతితో సెల్ఫీ దిగి, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఆ ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు.

పుణెలోని కొంధ్వా ప్రాంతంలో ఉన్న హౌసింగ్ సొసైటీలో రాత్రి 7.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కొరియర్ వచ్చిందని, దాన్ని డెలివరీ చేయడానకిి వచ్చానని చెప్పి మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆ వ్యక్తి తలుపు తట్టాడు. ఆ సమయంలో ఆమె సోదరుడు పనిమీద బయటకు వెళ్లాడు. ఇంట్లో ఆ యువతి ఒంటరిగా ఉండడంతో ఆమెపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం, బాధితురాలితో సెల్ఫీ తీసుకొని, నేరం గురించి ఎవరికీ చెప్పొద్దని, ఎవరికైనా చెబితే ఆ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తానని హెచ్చరించాడు...