భారతదేశం, నవంబర్ 18 -- తెలంగాణలో ఉన్న మూడు లక్షలకుపైగా గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికులకు సామాజిక భద్రత, చట్టపరమైన గుర్తింపు, సంక్షేమం కల్పించే దిశగా తెలంగాణ కేబినెట్ "తెలంగాణ ప్లాట్‌ఫారమ్ ఆధారిత గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమం)చట్టం, 2025" ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం బిల్లును ఆమోదించింది. కేబినెట్ సమావేశం తర్వాత కార్మిక మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడుతూ, రాబోయే అసెంబ్లీ సమావేశంలో బిల్లును ప్రవేశపెడతామని అన్నారు.

గిగ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు, అగ్రిగేటర్లు, ప్రభుత్వంతో ఒక బోర్డు ఏర్పాటు చేస్తారు. గిగ్ వర్కర్లను అగ్రిగేటర్లు తప్పనిసరి నమోదు చేయడం, గిగ్ వర్కర్ సంక్షేమాన్ని పర్యవేక్షించడానికి కార్మికులు, అగ్రిగేటర్లు, ప్రభుత్వంతో కూడ...