భారతదేశం, జనవరి 7 -- ముంబై, జనవరి 7, 2026: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు డీమార్ట్ షేర్లు (అవెన్యూ సూపర్ మార్ట్స్) బుధవారం తీపి కబురు అందించాయి. రిటైల్ దిగ్గజం రాధాకిషన్ దమానీకి చెందిన 'అవెన్యూ సూపర్ మార్ట్స్' (DMart) షేర్ ధర నేడు దాదాపు 5 శాతం మేర పెరిగింది. 2025 ఆగస్టు మధ్యకాలం తర్వాత ఈ స్థాయిలో ఒకే రోజులో షేర్ విలువ పెరగడం ఇదే మొదటిసారి. మార్కెట్ ముగిసే సమయానికి షేరు ధర రూ. 3,844.70 వద్ద ట్రేడ్ అయింది.

డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి కంపెనీ విడుదల చేసిన తాజా అప్‌డేట్ ప్రకారం.. గడిచిన మూడు నెలల్లో డీమార్ట్ కొత్తగా 10 స్టోర్లను ప్రారంభించింది. దీంతో 2026 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మొత్తం 27 కొత్త స్టోర్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డీమార్ట్ స్టోర్ల సంఖ్య 442కి చేరుకుంది.

ఆదాయం: ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ...