భారతదేశం, జనవరి 10 -- రిటైల్ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన డీమార్ట్ (అవెన్యూ సూపర్ మార్ట్స్), 2026 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) అద్భుతమైన పనితీరు కనబరిచింది. శనివారం కంపెనీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గతేడాదితో పోలిస్తే నికర లాభం, ఆదాయంలో చెప్పుకోదగ్గ వృద్ధి నమోదైంది.

ఈ త్రైమాసికంలో డీమార్ట్ తన నెట్‌వర్క్‌ను మరింత విస్తరించింది. డిసెంబర్ నాటికి కొత్తగా 10 స్టోర్లను ప్రారంభించడంతో, దేశవ్యాప్తంగా మొత్తం స్టోర్ల సంఖ్య 442కి చేరింది.

కంపెనీ అమ్మకాలలో ఆహార, నిత్యావసర వస్తువుల (Food and Grocery) వాటా సింహభాగం (57.19%) ఉంది. జనరల్ మెర్కండైజ్, అపెరల్స్ 22.98% వాటాను కలిగి ఉండగా, నాన్-ఫుడ్ ఎఫ్.ఎమ్.సి.జి ఉత్పత్తులు 19.83% వాటాను నమోదు చేశాయి.

డీమార్ట్ ప్రస్థానంలో గత రెండు దశాబ్దాలుగా కీలక పాత్ర పోషించిన నెవిల్ నోరో...