భారతదేశం, ఆగస్టు 27 -- డీమార్ట్‌ పేరను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ మార్కెట్లకంటే డీమార్ట్ వైపే జనాలు ఎక్కువగా చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అందించే డిస్కౌంట్లు, క్వాలిటీ ప్రొడక్ట్స్‌పై ప్రజలకు నమ్మకం పెరిగింది. చాలా మంది డీమార్ట్‌లో షాపింగ్ చేస్తారు. మనం చూస్తే అక్కడ ఎప్పుడూ జనాలు ఉంటూనే ఉంటారు. దీనికి కారణం అక్కడ వస్తువులు చాలా చౌక ధరలకు లభిస్తాయి. డీమార్ట్ అనేక విధాలుగా ప్రజలకు దగ్గరైంది. సరే ఇదంతా పక్కన పెడితే డీమార్ట్ నుంచి మీరు కూడా సంపాదించుకోవచ్చు. మీ ప్రొడక్ట్ ఎక్కువగా సేల్ అయితే మీ సంపాదన లక్షల్లోకి వెళ్తుంది.

సాధారణంగా డీమార్ట్ తక్కువ ధరకు మంచి నాణ్యమైన వస్తువులను అందించగల వ్యాపారుల నుండి వస్తువులను కొనుగోలు చేస్తుంది. తద్వారా వినియోగదారులకు తక్కువ ధరకు డెలివరీ చేస్తుంది. ఈ కారణంగా కస్టమర్లు హ్యాపీగా ఫీలవుతారు. ఇది వి...