భారతదేశం, నవంబర్ 19 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో డీమాన్ పవన్, రీతు చౌదరి మధ్య స్పెషల్ బాండ్ ఉందని ఆడియన్స్ అంటున్నారు. రీతు కూడా తన బాండ్ తన ఇష్టమని చెప్పింది. ఈ వారం రీతును పవన్ నామినేట్ చేయడంతో ఏమైనా తేడా కొడుతుందేమో అనిపించింది. కానీ మళ్లీ ఇద్దరు కలిసిపోయారు. ఫ్యామిలీ వీక్ లో బిగ్ బాస్ హౌస్ లోకి పవన్ తల్లి వచ్చారు. ఈ సందర్భంగా పవన్, రీతు కెమిస్ట్రీ వైరల్ గా మారింది.

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు వచ్చి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలోనే డీమాన్ పవన్ తల్లి హౌస్ లోకి చిన్ను అంటూ ఎంట్రీ ఇచ్చారు. అమ్మను చూసి పవన్ ఎమోషనల్ అయ్యాడు. సున్నుండలు తెచ్చి, అందరికీ ఇచ్చారు అమ్మ. కొడుక్కి తన చేత్తో బిర్యానీ తినిపించారు.

హౌస్ మేట్స్ అందరూ పవన్ అమ్మతో ప్రేమగా మాట్లాడారు. పవన్ పెళ్లి ఎప్పుడు? అని అడిగారు....