భారతదేశం, నవంబర్ 3 -- బిగ్ బాస్ 9 తెలుగులో 8 వారాలు పూర్తయ్యాయి. గత వారం దివ్వెల మాధురి హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. తొమ్మిదో వారం నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగుతోంది. ఈ వారం నామినేషన్లలో సంజన్ వర్సెస్ రీతు మాటల యుద్ధం సాగింది. ఈ క్రమంలో డీమాన్ పవన్ తో ఉన్న రిలేషన్ షిప్ పై రీతు క్లారిటీ ఇచ్చింది.

బిగ్ బాస్ 9 తెలుగు 9వ వారం నామినేషన్స్ ప్రక్రియ హోరాహోరీగా మారింది. కంటెస్టెంట్ల ఫొటోలోను ఒక్కో టెడ్డీ బేర్ మీద ఉంచారు. కంటెస్టెంట్లు తమ టెడ్డీ బేర్ కాకుండా ఇతరుల ఫొటో ఉన్న టెడ్డీ బేర్ ను సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లాలి. చివరగా ఎవరు మిగిలితే వాళ్లతో పాటు వాళ్ల దగ్గరున్న టెడ్డీ బేర్ పై ఉన్న ఫొటోలోని కంటెస్టెంట్ నామినేషన్లలోకి వస్తారు. ఆ తర్వాత తమ రీజన్స్ చెప్పాల్సి ఉంటుంది. చివరకు హౌస్ మేట్స్ నిర్ణయం ప్రకారం నామినేషన్ నిర్ణయిస్తారు.

9వ వారం నామి...