భారతదేశం, మే 5 -- రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 16 వేల 347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఏడేళ్ల తర్వాత వచ్చిన అవకాశం కావడంతో.. అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షకు పూర్తిస్థాయిలో సన్నద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో నిరుపేద అభ్యర్థుల కోసం ప్రభుత్వం ఉచిత శిక్షణ అందిస్తోంది. పరీక్షలకు సంసిద్ధం అయ్యేలా చేస్తోంది.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమశాఖ ద్వారా.. 5 వేల 50 మంది ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఇందులో 600 మంది విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాల్లోని ఏపీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. మిగిలిన 4వేల 460 మందికి జిల్లాల్లోని ఎంపిక చేసిన కేంద్రాల ద్వారా ఉచిత శిక్షణ అందిస్తున్నారు.

కాకినాడ జిల్లాలో ఆదిత్య పోటీ పరీక్షల శిక్షణ సంస్థ, శ్యామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ల ద్వారా 600 మందికి కోచింగ్ ...