భారతదేశం, మే 13 -- ఆంధ్రప్రదేశ్‌‌లో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌కు దరఖాస్తు గడువును పొడిగించారు.

ఏపీ డిఈఈ సెట్‌ 2025 దరఖాస్తు గడువును మే 20వ తేదీ వరకు పొడిగించినట్టు కన్వీనర్ ప్రకటించారు. దరఖాస్తుల గడువు మే 8వ తేదీతో ముగియగా మే 20వరకు దానిని పొడిగించారు.

https://cse.ap.gov.in లేదా https://apdeecet.apcfss.in

ఏపీ డీఈఈ సెట్‌ దరఖాస్తులను ఏప్రిల్ 22 నుంచి మే 8 వరకు స్వీకరించారు. దరఖాస్తుల సంఖ్య తక్కువగా ఉండటంతో మే 20వ తేదీ వరకు గడువును పొడిగించారు.

డీఈఈ సెట్‌కు దరఖాస్తు చేసే అభ్యర్థులు రూ.750 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

డిఈఈ సెట్‌ 2025కు హాజరయ్యే అభ‌్యర్థులు డీఈఈ సెట్‌ ర్యాంకులతో పాటు కనీస విద్యార్హతలు కలిగి ఉండాలి.

ఇంటర్మీడియట్‌ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన వారు, పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్...