భారతదేశం, డిసెంబర్ 31 -- పార్టీ అంటే చిన్నదో పెద్దదో డీజే బాక్స్ మాత్రం ఉండాలి. ఉర్రూతలూగించే పాటలు ప్లే అవుతూ ఉండాలి. ఇక డిసెంబర్ 31 పార్టీ అంటే ఇక సందడి ఏ రేంజ్ లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో పార్టీలు ప్లాన్ చేసుకునే వాళ్లు ముందుగా సౌండ్ సిస్టమ్స్ అరేంజ్ చేసుకుంటారు. నైట్ అంతా పాటలతో హోరెత్తిస్తారు. మరి డిసెంబర్ 31 పార్టీలో ప్లే చేయాల్సిన పాటలు ఇక్కడ ఉన్నాయి. 2025లో ఊపు ఊపిన టాప్ 5 సాంగ్స్ ఇవి.

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసింది హిందీ మూవీ సైయారా. కలెక్షన్ల మోత మోగించింది. మరోవైపు మ్యూజిక్ తోనూ మాయ చేసింది. ఈ రొమాంటిక్ డ్రామా సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక సైయారా టైటిల్ ట్రాక్ అయితే ఊపేస్తోంది. స్పాటిఫై గ్లోబల్ టాప్ 50లో చోటు దక్కించుకున్న ఫస్ట్ బాలీవుడ్ సాంగ్ ఇదే. యూట్యూబ్ లోనే ఈ సాంగ్ కు 59 క...