భారతదేశం, డిసెంబర్ 8 -- తెలంగాణలో ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల్లో భాగంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటోంది. డిసెంబర్ 9వ తేదీ ఉదయం 11 గంటలకు అన్ని కలెక్టరేట్ సముదాయాలలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. వేడుకలు ముగిసిన వెంటనే ఫొటోలతో కూడిన నివేదికలను సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించారు.

డిసెంబర్ 9, 2024న రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత మిగిలిన జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. జూలై 2025లో ప్రభుత్వం అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాలలో 12 అడుగుల ఎత్తైన తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఆదేశించ...