భారతదేశం, నవంబర్ 26 -- అంత‌ర్జాతీయ సంస్థ‌ల పెట్టుబ‌డుల‌కు గ‌మ్య‌స్థానంగా హైద‌రాబాద్ నిలిచేలా తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ నిల‌వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పెట్టుబ‌డిదారుల‌కు సంబంధించి అనుకూల అంశాలతో పాటు ప్రభుత్వం క‌ల్పించే స‌దుపాయాల‌ను సమ్మిట్ లో స‌మ‌గ్రంగా వివ‌రించాల‌ని చెప్పారు.

డిసెంబ‌రు 8, 9వ తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వ‌హించ‌నున్న స‌మ్మిట్‌కు సంబంధించి బ్రాండింగ్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుతో పాటు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

గ్లోబ‌ల్ సమ్మిట్‌కు సంబంధించి వివిధ సంస్థ‌లు రూపొందించిన ప్ర‌చార చిత్రాలు, వీడియోలను వీక్షించి ప‌లు మార్పులు చేర్పులు చ...