భారతదేశం, డిసెంబర్ 4 -- ఈరోజు కేవలం మార్గశిర మాసంలో వచ్చే గురువారమే కాదు, ఈరోజు గురువారం, పౌర్ణమి, కృత్తికా నక్షత్రం, దత్త దత్తాత్రేయ జయంతి రావడం కూడా చాలా విశేషం. ఇంతటి విశిష్టమైన రోజున కొన్ని పరిహారాలను పాటించడం వలన ఆనందంగా ఉండొచ్చు. కెరియర్‌లో కూడా మార్పులు వస్తాయి. దోషాలన్నీ కూడా తొలగించుకోవడానికి వీలు అవుతుంది. మరి ఇంతటి విశిష్టమైన రోజున ఏం చేయాలి? ఎలాంటి పరిహారాలను పాటిస్తే జీవితం మారుతుంది? ఇటువంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈరోజు కొన్ని పరిహారాలను పాటించడం వలన గురు బలం పెరిగే అవకాశం ఉంది. మేష రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, కన్య రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, మీన రాశి వారికి గురు బలం తగ్గుతుంది. వారు కచ్చితంగా గురు బలాన్ని పెంచుకోవడానికి కొన్ని పరిహారాలను ఈ విశిష్టమైన రోజున పాటించడం మంచిది.

డిసెంబర్ 5 నుంచి ఈ రాశుల వారికి గుర...