భారతదేశం, నవంబర్ 18 -- టీటీడీ అత్యవసర ట్రస్ట్ బోర్డు సమావేశం మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన, ఈవో సింఘాల్, ఇతర బోర్డు సభ్యులతో కలిసి జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది బోర్డు. ఆ విషయాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. వైకుంఠ ద్వార దర్శనం డిసెంబర్ 30 నుండి జనవరి 08 వరకు భక్తులకు కల్పించనున్నట్టుగా తెలిపారు. 10 రోజుల పాటు 8 లక్షల మంది భక్తుల కోసం వైకుంఠ ద్వార దర్శనం ప్లాన్ చేశామన్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టుగా పేర్కొన్నారు.

'వైకుంఠ ద్వార దర్శనం కోసం అందుబాటులో ఉన్న 182 గంటల్లో 164 గంటలు సాధారణ భక్తులకు కేటాయించాం. ఆఫ్‌లైన్ టోకెన్ల జారీ లేదు. మొదటి మూడు రోజులు శ్రీవాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు లేవని, రద్దు చేస్తున్నాం. ఈ డిప్ ద్వారా సేకరించిన టోకెన్లు ...