భారతదేశం, డిసెంబర్ 22 -- వైకుంఠ ఏకాదశి 2025: ఏకాదశి తిధికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి నెలలో వచ్చే ఏకాదశి నాడు అందరూ ఉపవాసం ఉండి విష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. వైకుంఠ ఏకాదశి చాలా ప్రత్యేకమైనది, అత్యంత పవిత్రమైనది. వైకుంఠ ఏకాదశి నాడు విష్ణువును పూజించడం వలన ఎంతో మంచి ఫలితం కనిపిస్తుంది, పుణ్యం వస్తుంది. ఈ పవిత్రమైన రోజు విష్ణుమూర్తికి అంకితం చేయబడింది.

వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) నాడు ఉపవాసం ఉండి విష్ణువును భక్తితో ఆరాధిస్తే పాపాలు తొలగిపోయి ఎంతో పుణ్యం కలుగుతుంది. విష్ణుమూర్తి అనుగ్రహంతో ఆనందంగా ఉండవచ్చు. వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుంది? ఆ రోజు చేయాల్సిన పనుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30న రాబోతోంది. ఆ రోజు ఉత్తర దిక్కు నుంచి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి దర్శనం...