భారతదేశం, డిసెంబర్ 23 -- గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు, అది అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక విధాలుగా మార్పులను తీసుకొస్తుంది. ఒక్కోసారి శుభ యోగాలు ఎదురైతే, ఇంకొన్ని సార్లు అశుభ యోగాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

గ్రహాలు ఎప్పటికప్పుడు రాశులను మార్చడంతో పాటు నక్షత్రాలను కూడా మారుస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కూడా శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో గ్రహాల సంచారం జరిగేటప్పుడు మరో గ్రహంతో సంయోగం కూడా జరుగుతుంది.

మరో రెండు రోజుల్లో కుజుడు నక్షత్రాన్ని మార్చబోతున్నాడు. కుజుడు నక్షత్రాన్ని మార్చినప్పుడు కొన్ని రాశుల వారి జీవితాల్లో అనేక లాభాలు కలుగుతాయి. కుజ సంచారం అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. త్వరలోనే గ్రహాల కమాండర్ అయిన కుజుడు నక్షత్రాన్ని మార్చబోతున్నాడు. ...