భారతదేశం, నవంబర్ 25 -- తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. 31 జిల్లాల్లోని 545 గ్రామీణ మండలాల్లోని 12,760 పంచాయతీలు, 1,13,534 వార్డులకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, ఎన్నికల సంఘం ఏర్పాట్లు మెుదలుపెట్టాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుమదిని తాజాగా వివరాలను వెల్లడించారు.

డిసెంబర్ 11న తొలి విడత ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉండనుంది. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్, ఆ తర్వాత ఫలితాల ప్రకటన ఉంటుంది. ఒక దశకు మరో దశకు మధ్య రెండు రోజుల తేడా ఉంటుంది. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఇవాళ్టి నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.

ఈ నెల 27వ తేదీ నుంచి మెుదటి దశ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభం కానున్నాయని ఎన్నికల కమిషనర్ వెల్లడించారు. అలాగే 30వ...