భారతదేశం, నవంబర్ 17 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు అశుభ యోగాలు, శుభ యోగాలు ఏర్పడుతుంటాయి. మరి కొన్ని రోజుల్లో నవంబర్ నెల పూర్తి కాబోతోంది, డిసెంబర్ రాబోతోంది. ఈ డిసెంబర్ నెలలో కొన్ని గ్రహాల సంచారంలో మార్పు ఉండనుంది.

ముఖ్యంగా శుక్రుని సంచారం ఆసక్తికరంగా మారబోతోంది. డిసెంబర్ 2025లో శుక్రుడు నాలుగు సార్లు తన స్థానాన్ని మారుస్తాడు. ఐదు రాశుల వారికి విపరీతమైన లాభాలను తీసుకొస్తాడు. శుక్రుడు సంపద, డబ్బు, విలాసవంతమైన జీవితానికి కారకుడు. శుక్ర సంచారం కొన్ని రాశుల వారిపై శుభ ఫలితాలను తీసుకురాబోతోంది.

డిసెంబర్ 9న శుక్రుడు అనూరాధ నక్షత్రం నుంచి జ్యేష్ఠ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. డిసెంబర్ 19న శుక్రుడు దక్షిణం వైపు కదులుతాడు. డిసెంబర్ 20న శుక్రుడు వృశ్చిక రాశి నుంచి తులా రాశి ద్వారా ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు....